Tabu: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటి టబు... 6 d ago

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న కొత్త చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం. ముంబయిలో పూరి, టబు కలిసి కథ, పాత్రలపై చర్చించినట్లు తెలుస్తోంది. 'అల... వైకుంఠపురములో' తర్వాత టబు తెలుగులో చేస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో టబు పాత్రకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.